Header Banner

మంత్రికు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు! పీడీఎస్ మాఫియాపై కఠినంగా..

  Sun Apr 06, 2025 12:48        Politics

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సుఖ సంతోషాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బాధ్యతల నిర్వహణలో ఓర్పుతో, నేర్పుగా వ్యవహరించే అనుభవశీలి, సోదర సమానులు నాదెండ్ల మనోహర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ చెప్పారు. గత పాలకులు పక్కదారి పట్టించిన ప్రజాపంపిణీ వ్యవస్థను నాదెండ్ల చక్కదిద్దుతున్నారని తెలిపారు. పీడీఎస్ మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు షురూ.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం!

 

ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. ఖరీఫ్ సీజన్లో విజయవంతంగా ధాన్యం సేకరించారని పవన్ కల్యాణ్ చెప్పారు. నిత్యావసరాల ధరలు అదుపులోకి తీసుకురావడం, దీపం-2 పథకం అమలు రాష్ట్రంలోని మహిళలకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. రాష్ట్ర మంత్రిగా తన కర్తవ్య నిర్వహణను బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో చేస్తున్నారని కొనియాడారు. పార్టీ శ్రేణులను, నాయకులను అనుసంధానించుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఆయన నిర్వర్తించిన పాత్ర మరచిపోలేనిదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli